జీఎస్టీ స్లాబ్ సవరణ సబబే
NEWS Sep 04,2025 07:03 am
జీఎస్టీ కౌన్సిల్ స్లాబుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. తాను దీనిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పేదల అనుకూల, అభివృద్ధి ఆధారిత నిర్ణయం అన్ని వర్గాలకు మేలు చేస్తుందని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. గొప్ప మార్పుకు ముందడుగు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను అభినందించారు. దీని వల్ల ఎందరికో మేలు జరుగుతుందన్నారు.