స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి : ఈసీ
NEWS Sep 04,2025 07:00 am
ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. మూడు నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. జనవరి లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అక్టోబర్ 15లోగా వార్డుల విభజన పూర్తి చేయాలని తెలిపింది. నవంబర్ 30లోగా పోలింగ్ కేంద్రాలు, డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది.