ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తారు : సీఎం
NEWS Sep 04,2025 06:56 am
మాజీ సీఎం జగన్ రడ్డిపై నిప్పులు చెరిగారు సీఎం చంద్రబాబు. పదే పదే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేస్తున్న తనకు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇస్తారని, ప్రభుత్వం ఇవ్వదని తెలుసుకుంటే మంచిదని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఏ పార్టీని ఎక్కడ పెట్టాలో తాము నిర్ణయించమని, జనమే డిసైడ్ చేస్తారన్నారు. మీరు చేసిన అరాచకాలు చూసి 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా బుద్ది రాలేదన్నారు సీఎం.