కూతురిని తిరిగి అప్పగించిన పోలీసులు
NEWS Sep 04,2025 01:28 pm
నిర్మల్ జిల్లాకు చెందిన అంజయ్య, మణి 11 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి పాప కీర్తన పుట్టిన తర్వాత కుటుంబ సమస్యలతో ఇద్దరూ దూరమయ్యారు. విడాకులు ఇప్పించాలని మణి 6 నెలల క్రితం ఫిర్యాదు చేసినా స్పందన రాలేదు. ఈరోజు ఉదయం అంజయ్య కూతురిని ఎత్తుకెళ్లడంతో మణి, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు 6 గంటల్లోనే కీర్తనను కనుగొని తల్లికి అప్పగించగా, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.