అల్లర్లు సృష్టిస్తే కేసులు: ఎస్ఐ అనిల్
NEWS Sep 04,2025 09:48 am
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా చేసుకోవాలని ఇబ్రహింపట్నం మండలం ఎస్ఐ అనిల్ సూచించారు. నిమజ్జన సమయంలో శోభాయాత్రలలో అల్లర్లు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లే, నిమజ్జనం కూడా క్రమబద్ధంగా, ఎలాంటి అల్లర్లు సృష్టించకుండా చేసుకోవాలని, డిజెలు అధిక శబ్దంతో ఇబ్బంది కలిగించవద్దని వినాయక ఉత్సవ కమిటీలను కోరారు.