మండల స్థాయి పాఠశాలల క్రీడా ఎంపిక పోటీలు
NEWS Sep 03,2025 07:36 pm
మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కో-ఎడ్యుకేషన్‌లో బుధవారం మండల స్థాయి పాఠశాలల క్రీడా ఎంపికలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మండల విద్యాశాఖ అధికారి స్వర్ణ జ్యోతి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో వివిధ క్రీడలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు నాగశ్రీ, పీడీలు ఆదినారాయణ, అనిల్ కుమార్, వీరన్న, అలాగే పీఈటీలు కృష్ణారావు, నరసింహ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.