ప్రభుత్వానికి కృతజ్ఞతలు: TGUS
NEWS Sep 03,2025 01:59 pm
ఉపాధ్యాయ దినోత్సవ నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు TGUS జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, కార్యదర్శి జారుపుల గోవింద్. సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసంప్రతి మండలానికి రూ.5 వేలూ, ప్రతి జిల్లాకు రూ.15 వేల నిధులు కేటాయించడాన్ని స్వాగతించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులకే అవార్డు ఇవ్వాలని కోరారు. అధికారుల కమిటీ సిఫారసు చేసిన వారికి అవార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.