బాలల గణపతి వద్ద అన్నప్రసాదం
NEWS Sep 03,2025 07:35 pm
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలో అంబేద్కర్ కాలనీకి చెందిన చిన్నారులు గత 3 సంవత్సరాలుగా స్వయంగా వినాయకుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. పిల్లల ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూ వారి తల్లిదండ్రులు కలిసి ఘనంగా అన్నప్రసాద విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు వినాయకునికి వివిధ రకాల ప్రసాదాలు సమర్పించగా, కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. చిన్నారులు ఇంతటి పండుగ వాతావరణంలో ఆనందంగా గడిపారు.