గ్రామ పంచాయితీలకు రూ.1,121 కోట్లు విడుదల
NEWS Sep 03,2025 07:23 pm
కేంద్రం ఏపీ సర్కార్ కు భారీ ఎత్తున నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల బలోపేతానికి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. మొత్తం 13,325 పంచాయతీలకు గాను రూ. 1,121 కోట్లు శాంసన్ చేసింది. ఈ సందర్బంగా ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.