నిమజ్జనంలో అల్లర్లు చేస్తే కేసులు: ఎస్సై రాజు
NEWS Sep 03,2025 02:03 pm
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా చేసుకోవాలని మల్లాపూర్ ఎస్సై రాజు సూచించారు. నిమజ్జన సమయంలో శోభాయాత్రలలో అల్లర్లు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లే, నిమజ్జనం కూడా క్రమబద్ధంగా, ఎలాంటి అల్లర్లు లేకుండా చేసుకోవాలని వినాయక ఉత్సవ కమిటీలకు సూచించారు. డిజెలు, అధిక శబ్దంతో ఇబ్బంది కలిగించవద్దని, ఎదురెదురు శోభాయాత్రలతో గొడవలకు దిగేవారిపై కేసులు తప్పవని తెలిపారు.