సోషల్ మీడియాలో బయో మార్చుకున్న కవిత
NEWS Sep 03,2025 06:37 pm
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత Xలో తన బయోను మార్చుకున్నారు. ఇంతకుముందు కామారెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి ఫౌండర్ అని ఉండేది. తాజాగా మాజీ ఎంపీ, జాగృతి ఫౌండర్ అని మార్చారు. రెండు రోజుల తర్వాత ఆమె భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ప్రెస్‌మీట్‌లో తెలిపారు.