ఆపదమిత్ర శిక్షణ పొందాలనుకుంటున్నారా?
NEWS Sep 03,2025 06:26 pm
ఆపత్కాలంలో సామాజిక బాధ్యతతో బాధితులకు అండగా నిలవాలని మేరా యువ భారత్ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ అన్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ ఆపదమిత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సామాజిక స్పృహ కలిగిన యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాకు చెందిన యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ???? 0870-2958776 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.