భద్రాద్రిలో 5 సీట్లు మావే: రేగా కాంతారావు
NEWS Sep 03,2025 06:24 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఐదింటికీ ఐదు స్థానాలు గెలుచుకుంటామని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం కొత్తగూడెంలో మాట్లాడుతూ నేడు కాంగ్రెస్ నుంచి 300 మంది బిఆర్ఎస్‌లో చేరారని, ఇంకా చేరికలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొంటూ, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతామని అన్నారు.