ఘనంగా రామకృష్ణ కళాశాల స్వాగతోత్సవం
NEWS Sep 03,2025 06:16 pm
కోరుట్లలోని రామకృష్ణ డిగ్రీ & పిజి కళాశాలలో ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు కొత్తగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతోత్సవ వేడుకలు ‘లుమినా 2025’ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనను కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ సన్మానించారు. విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గాడిపళ్లి హరిప్రియ అంజయ్య గౌడ్, ప్రిన్సిపాల్ బెజ్జారపు ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.