గిట్టుబాటు ధర కోసం రైతుల వినతి
NEWS Sep 03,2025 01:00 pm
అన్నమయ్య జిల్లా కోడూరు, చిట్వేల్, పుల్లంపేట, పెనగలూరు మండలాల్లో 15 వేల ఎకరాల్లో సాగు చేసిన బొప్పాయి పంటకు దళారులు నిర్దేశించిన ధరలు రైతులను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ముందుగా క్వింటాల్‌కు ₹16 ఇచ్చిన ధరను ఇప్పుడు ₹5కి తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కలెక్టర్ నిర్ణయించిన కనీస ధర అయిన ₹10ను ఖచ్చితంగా అమలు చేయాలని, కనీసం ₹15 గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతు సంఘం, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 3 బుధవారం వారు సబ్ కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చ్. చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు చిట్వేల్ రవికుమార్, రైతు సంఘ నాయకులు ఆదినారాయణ, ఈశ్వరయ్య, వెంకటరమణ, హరి చరణ్ చౌదరి, కందుల సుబ్రహ్మణ్యం, శివకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.