చేసిన పాపాలు ఎక్కడికీ పోవు : సీఎం
NEWS Sep 03,2025 05:05 pm
బీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కవితకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆనాడు అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ దోచుకున్న అవినీతి సొమ్ము పంపకాల్లో గొడవలు వచ్చి కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారని మండిపడ్డారు. తాను ఆ చెత్తగాళ్ల వెనుక ఎందుకు ఉంటానని ప్రశ్నించారు. తాను నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం నాయకుడిగా ముందుంటానని ప్రకటించారు.