రైల్వే కోడూరులో వరాహి రెస్టారెంట్ ప్రారంభం
NEWS Sep 03,2025 12:53 pm
పుల్లంపేట మండలం రెడ్డిపల్లి కట్టలో నిర్మించిన శ్రీ వరాహి కేఫ్ అండ్ రెస్టారెంట్ను ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వసతుల ఆహార కేంద్రాలు ఏర్పడటం ఆనందదాయకమని, ఇవి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు యువతకు ప్రోత్సాహకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.