త్వరలో విద్యుత్ శాఖలో జాబ్స్ భర్తీ
NEWS Sep 03,2025 04:08 pm
ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు ఓకే చెప్పారని, త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ట్రాన్స్ కో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ వ్యయం తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. రూ. 6 వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఆర్డీఏలో అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ కొనసాగుతోందన్నారు.