విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన
NEWS Sep 03,2025 04:10 pm
మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ కిరణ్ కళాశాల విద్యార్థులకు సైబర్ క్రైమ్, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ తెలియని నెంబర్ నుండి వచ్చిన కాల్స్ కి, మెసేజ్ లకు స్పందించ వద్దని కోరారు. ఈ విషయాన్ని కుటుంబీకులు, స్నేహితులకకు తెలియ చేయాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అమ్మాయిలను ఎవరైనా వేధించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా తాట తీస్తామన్నారు.