అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయి
NEWS Sep 03,2025 04:13 pm
కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరు మండలంలో ఆయన పర్యటించారు. ఈ పరిటాల లో భాగంగా తిర్లాపురం గ్రామపంచాయతీ లో 20 లక్షల అంచనా వ్యయంతో అంగన్వాడికి బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం పలు సిసి రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు నవీన్,తహసీల్దార్ అద్దంకి నరేష్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.