ఆదివాసి కుటుంబాలకు దోమతెరలు వితరణ
NEWS Sep 03,2025 04:14 pm
హార్ట్ టూ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పినపాక మండలం లో ఆదివాసీ కుటుంబాలకు దోమతెరను పంపిణీ చేశారు. మండల పరిధిలో గల తేల్లాపూర్, పిట్టతోగు 68 ఆదివాసి కుటుంబాలకు దోమతెరలు పంపిణీ చేశామని తోలం శ్రీనివాస్ తెలియజేశారు. పిట్టతోగు గ్రామంలో నివసిస్తున్న 32 కుటుంబాలకు దాతలు గణేష్ రావు, సోమయాజులు దోమతెరలు అందించారు. తేల్లాపూర్ గ్రామంలో నివసిస్తున్న 36 కుటుంబాలకు దాతలు జయమ్మ, గణేశం సహకారంతో దోమ తెరలు పంపిణీ చేశారు.