హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదు డేంజర్
NEWS Sep 03,2025 08:30 am
ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకోవడానికి హరీష్ రావు పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈరోజు నాకు జరిగింది రేపు కేసీఆర్, కేటీఆర్ కు కూడా జరగొచ్చన్నారు. మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి నాన్న అంటూ కేసీఆర్ కు హితవు పలికారు. కేసీఆర్, కేటీఆర్, నేను కలిసి ఉండకూడదని హరీష్ రావు కుట్రలు పన్నాడంటూ వాపోయారు. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సీఎం రేవంత్ కు హరీశ్ సరెండర్ అయ్యాడంటూ బాంబు పేల్చారు.