చిట్వేల్: మెగా రక్తదాన శిబిరం విజయవంతం
NEWS Sep 03,2025 06:20 pm
చిట్వేల్: ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా చిట్వేల్ హెల్ప్‌లైన్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 120 మంది రక్తదాతలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. “రక్తదానం అంటే ప్రాణదానం. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేస్తే రక్త కొరత లేని సమాజం నిర్మించవచ్చు. మానవసేవే మాధవసేవ అన్న భావనతో యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు పాల్గొనాలి” అని నిర్వాహకులు తెలిపారు. రక్తదాతల ఉత్సాహం, సమాజ సేవా తపన ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు.