అక్రమ అరెస్టులను ఖండించాలి: న్యూ డెమోక్రసీ
NEWS Sep 03,2025 10:44 am
అక్రమ అరెస్టులను ఖండిస్తూ, అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని న్యూడెమోక్రసీ నేత ముసలి సతీష్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానుండగా, ఆయనను ముందుగానే చర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నించే నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇది తప్పు చర్య అని న్యూడెమోక్రసీ నాయకులు తీవ్రంగా విమర్శించారు.