మణుగూరులో గణేష్ నిమజ్జనంపై పర్యవేక్షణ
NEWS Sep 03,2025 10:42 am
మణుగూరు: గణేష్ నిమజ్జన కార్యక్రమం ఎటువంటి అపశృతి లేకుండా సజావుగా సాగేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉన్నారని తాసిల్దార్ అద్దంకి నరేష్ తెలిపారు. బుధవారం తెల్లవారుజాము నుండి ఆయన స్వయంగా నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. మణుగూరు పోలీస్ సిబ్బంది సహకారంతో భక్తులు గణపతి విగ్రహాలను గోదావరిలో సురక్షితంగా నిమజ్జనం చేయగా, భక్తులకు అధికారులు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ అద్దంకి నరేష్ పట్ల పలువురు అభినందనలు వ్యక్తం చేశారు.