మదగడ గిరిజన పల్లెకు పవన్ కళ్యాణ్
NEWS Sep 03,2025 08:03 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 5వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం మదగడ గిరిజన గ్రామాన్ని సందర్శిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. మదగడ గ్రామస్తులు నిర్వహించుకునే ఆదివాసీ సంప్రదాయ ఉత్సవం ‘బలి పొరోబ్’ లో పాల్గొంటారు.12 రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలు గత నెల 25వ తేదీన ప్రారంభమయ్యాయి. అల్లూరి జిల్లాతోపాటు మన్యం జిల్లా, ఒడిశా రాష్ట్ర ఆదివాసీలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. గిరి పుత్రుల ఆహ్వానం మేరకు చివరి రోజు ఉత్సవాలకు పవన్ హాజరవుతున్నారు.