వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ఏర్పాటు చేయాలి
NEWS Sep 03,2025 07:52 am
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెమోరియల్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరామన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకు వచ్చారన్నారు. ఆయన తీసుకు వచ్చిన పథకాలు, కార్యక్రమాలను ఏ సీఎం ఈ దేశంలో తీసుకు రాలేదన్నారు.