కొత్త స్పాన్సర్ వేటలో బీసీసీఐ
NEWS Sep 03,2025 07:49 am
బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ టెండర్లను ఆహ్వానించింది. బెట్టింగ్, ఆన్ లైన్ గేమింగ్ సంస్థలకు చోటు లేదని పేర్కొంది. క్రిప్టో కరెన్సీ కంపెనీలపైనా నిషేధం విధించినట్లు తెలిపింది. దరఖాస్తు చేసుకునే సంస్థల వార్షిక టర్నోవర్ కనీసం రూ. 300 కోట్లు ఉండాలని నిబంధన విధించింది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 16గా నిర్ణయించినట్లు పేర్కొంది.