కేసీఆర్ చేసిన అభివృద్ది ఏ సీఎం చేయలేడు
NEWS Sep 03,2025 07:43 am
ఎంబీటీ పార్టీ అధ్యక్షుడు అమ్జదుల్లా ఖాన్ మాజీ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ చేసిన అభివృద్దిని ఏ ముఖ్యమంత్రి చేయలేడని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీఎంలకు, మంత్రులకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానని అన్నారు. కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, ఇంటిగ్రేటెడ్ ఆఫీసులకు కలర్ వేయడానికి కూడా వీళ్లకు చేత కాదంటూ ఎద్దేవా చేశారు. తాజాగా అమ్జదుల్లా ఖాన్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి పార్టీ వర్గాల్లో.