జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితా విడుదల
NEWS Sep 03,2025 07:40 am
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదలైంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారని రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 17వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. ఓటర్ల తుది జాబితాను ఈ నెల 30న విడుదల చేస్తామన్నారు.