చర్యలు తీసుకోవద్దంటూ రిటైర్డ్ సీఎస్ పిటిషన్
NEWS Sep 03,2025 07:36 am
రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన రిపోర్ట్ ను రద్దు చేయాలని కోరరాఉ. ప్రభుత్వం సాక్షిగా మాత్రమే తనకు నోటీసులు ఇచ్చిందని, ఇతర ఎలాంటి లీగల్ నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఈ దావాపై విచారణ చేపట్టనుంది కోర్టు.