వరద ప్రభావిత జిల్లాలకు రూ. 200 కోట్లు
NEWS Sep 03,2025 07:30 am
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సాయం కింద రూ.200 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్లకు రూ.10 కోట్ల చొప్పున కేటాయించింది. ఇతర జిల్లాలకు రూ. 5 కోట్ల చొప్పున ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.