బెలూచిస్తాన్ లో ఆత్మాహుతి దాడి
NEWS Sep 03,2025 07:27 am
బెలూచిస్తాన్ లో నైరుతి పాకిస్తాన్ లో జరిగిన పొలిటికల్ ర్యాలీపై ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రజలు ర్యాలీ నుంచి వెళ్తుండగా పార్కింగ్ ప్రాంతంలో దాడి జరిగినట్లు పేర్కొన్నారు అధికారులు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.