కవిత సస్పెన్షన్ అవివేకం: సంపత్ గౌడ్
NEWS Sep 03,2025 10:40 am
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం సిగ్గుచేటని తెలంగాణ జాగృతి సంఘం జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ అన్నారు. కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కవిత తెలంగాణ సంప్రదాయాలను, పండుగలను విశ్వవ్యాప్తంగా పరిచయం చేశారని, జాగృతి ద్వారా అనేక ఉద్యమాలు చేశారని తెలిపారు. ఇది అవివేకమైన చర్యగా భావిస్తున్నామని, ఎమ్మెల్సీ కవితకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.