ఘనంగా 'అందెలరవమిది' ట్రైలర్ వేడుక
NEWS Sep 03,2025 12:10 am
విజయవాడ: నాట్య కళాకారిణి ఇంద్రాణి దవులూరి ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన మూవీ 'అందెలరవమిది'. నాట్యమార్గం బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ వేడుక విజయవాడలో ఘనంగా జరిగింది. విక్రమ్ కొల్లూరు, తనికెళ్ళ భరణి, ఆదిత్య మీనన్, జయలలిత, ఆది లోకేష్, నిర్మల కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఇప్పటికే పలు అవార్డులు అందుకుంది. వేణు నక్షత్రం కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసిన ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.