కేటీఆర్ పర్యటనను విజయవంతం చేద్దాం
NEWS Sep 03,2025 12:14 am
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. చుంచుపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ, ఈనెల 10, 11 తేదీల్లో జరిగే కేటీఆర్ పర్యటనకు ప్రతి కార్యకర్త, అభిమాని భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని రేగా పిలుపునిచ్చారు.