పేదల పక్షాన అండగా ఉండేవి ఎర్రజెండాలే: సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
NEWS Sep 04,2025 07:14 am
పేదల పక్షాన ఎప్పుడూ అండగా ఉండేవి ఎర్రజెండాలే అని సీపీఐ జిల్లా అధ్యక్షుడు సాబీర్ పాషా అన్నారు. మంగళవారం మణుగూరు కిన్నెర కళ్యాణ మండపంలో సిపిఐ పార్టీ నియోజకవర్గస్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముందుగా రాష్ట్ర కమిటీ సభ్యులు అయోధ్య మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.