ప్రమాదకర స్థాయిలో యమునా నది
NEWS Sep 02,2025 07:10 pm
భారీ వర్షాలు, వరదల కారణంగా యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతితో ఢిల్లీలో ప్రమాదకర స్థాయిని దాటింది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి భారీగా నీటి విడుదల చేయడంతో అంతకంతకూ నీటి మట్టం పెరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు నీటి మట్టం 206.50 మీటర్లకు పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.