సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి
NEWS Sep 02,2025 07:13 pm
ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి బెండలపాడు గ్రామంలో జరిగే ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. పెద్ద ఎత్తున పూర్తయిన ఇండ్లలో పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాలు జరగడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.