అయ్యో గణపయ్య... నీకెంత అవమానం
NEWS Sep 02,2025 07:11 pm
నవరాత్రుల పురస్కరించుకొని గణపయ్యను గోదావరిలో నిమజ్జనం చేయడం పరిపాటి. కానీ మణుగూరు మండలం కొండాయిగూడెం ప్రాంతంలో నిమజ్జనం చేయకుండా గణపతి విగ్రహాలను ఒడ్డుమీద వదిలేశారు. ఇది సంబంధిత శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనం అంటూ భక్తజనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని గణపయ్య విగ్రహాలను నిమజ్జనం చేయాలంటూ భక్తజనం కోరుకుంటున్నారు. గణనాథుడికి ఇలాంటి అవమానం తగదన్నారు.