అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం
NEWS Sep 02,2025 10:41 pm
అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి, వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని ఫైర్ ఆఫీసర్ వినోద్ కుమార్ అన్నారు. పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్‌రోడ్‌లోని వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. వర్తక సంఘం అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యాపారులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే సమీప ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడం అత్యంత ముఖ్యమని వినోద్ కుమార్ సూచించారు. ఫైర్ సిబ్బంది, వర్తక సంఘం సభ్యులు భాస్కర్ రెడ్డి, రవి, లక్ష్మణ్, గీదా సాయి తదితరులు పాల్గొన్నారు.