బయ్యారం సంతను పరిశీలించిన ఎంపీ
NEWS Sep 02,2025 10:40 pm
పినపాక ఎంపీ ఓ వెంకటేశ్వరరావు బయ్యారం క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన కొత్త సంతను పరిశీలించారు. సంతలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వర్తకులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వీధి లైట్ల సమస్యను ప్రస్తావించగానే వెంటనే స్పందించిన ఎంపీ ఓ, అక్కడికక్కడే సెక్రటరీకి లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లైట్లు అమర్చే వరకు అక్కడే ఉంటానని స్పష్టం చేశారు. సమస్యకు వెంటనే స్పందించి పరిష్కారం చూపినందుకు వర్తకులు ఎంపీ ఓకు కృతజ్ఞతలు తెలిపారు.