1200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
NEWS Sep 02,2025 07:14 pm
చంద్రుగొండ మండలంలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు విధులకు హాజరైన 1200 మంది పోలీసు అధికారులతో సమావేశమై, వారికి పలు సూచనలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలని కోరారు.