పవన్ జన్మదినం సందర్భంగా రక్తదానం
NEWS Sep 02,2025 10:38 pm
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిట్వేలి మండలంలో విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. సమాజానికి అవసరమైన రక్తాన్ని అందించడం ఒక మహోన్నతమైన సేవ అని కస్తూరి సురేష్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, ఆయనకు నిజమైన జన్మదిన కానుక సేవా కార్యక్రమాల ద్వారానే ఇవ్వగలమని జనసేన కార్యకర్తలు తెలిపారు.