వినాయక మండప నిర్వాహకులతో ACP సమావేశం
NEWS Sep 02,2025 08:56 pm
పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండప నిర్వాహకులతో స్థానిక MB గార్డెన్‌లో సమావేశం జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ మండప నిర్వాహకులకు సూచనలు చేశారు. నిమజ్జనం శాంతియుతంగా, సురక్షితంగా జరగడానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పెద్దపల్లి సీఐ కె.ప్రవీణ్ కుమార్, టౌన్ ఎస్‌ఐలు జె.లక్ష్మణ్‌రావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.