కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఇబ్రహీంపట్నం మండల బీఆర్ఎస్ నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్యే సంజయ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం పై ఘోష్ కమిషన్ తప్పుడు నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ కోరడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ నిరసనలో పలువురు మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.