సుల్తానాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
NEWS Sep 02,2025 03:47 pm
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూ భారతి పోర్టల్ ద్వారా అందిన భూ సమస్యల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. సాధా బైనామా దరఖాస్తులపై హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన దరఖాస్తులను సిద్ధం చేసి ఉంచాలని సూచించారు. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.