హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు
NEWS Sep 02,2025 12:54 pm
మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఆదేశించింది. కాగా కాంగ్రెస్ నేత సృజన్ ఫిర్యాదుతో కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదికి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది.