కేసులు కొట్టేయాలని సీఎం పిటిషన్ దాఖలు
NEWS Sep 02,2025 12:28 pm
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 2021లో ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా తనపై పలు సెక్షన్ల కింద సైఫాబాద్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.