కేసీఆర్, హరీష్ లపై చర్యలు తీసుకోవద్దు
NEWS Sep 02,2025 12:23 pm
పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది ప్రభుత్వాన్ని. అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున అప్పటి వరకు జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. తమపై చర్యలు తీసుకోవద్దంటూ కేసీఆర్, హరీశ్ రావులు పిటిషన్ దాఖలు చేశారు. దసరా సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు.